Nutritious food–పౌష్టికాహార లోపం పిల్లలకు శాపం..తల్లిదండ్రుల మీదే కాపాడే భారం..

Telugu Mirror : దాపుగా అన్ని వయసుల వారిలో మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి.ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు అందరిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్య పిల్లల్లో కూడా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .చిన్న వయసులో పిల్లలకు మానసిక ఆరోగ్య రుగ్మతలు ఎక్కువ అవ్వడం వలన వారిలో దీర్ఘకాలికంగా చెడు ప్రభావం పడవచ్చు.
కెనడియన్ ఆరోగ్య నిపుణులు పిల్లల్లో మానసిక ఆరోగ్య పరిస్థితిలో, ప్రమాదం తెలుసుకోవడానికి అధ్యయనాన్ని చేపట్టారు. క్వాలిటీ లేని ఆహారం తీసుకునే వారిలో మానసిక ఆరోగ్య ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య సర్వే కనుగొంది .

conjunctivitis: వానాకాలం లో కండ్ల ‘కలక’లం. Dr .చింతా ప్రభాకర్ గారు చెప్పే జాగ్రత్తలతో మటు మాయం.

కాబట్టి పిల్లలకి ఆరోగ్య వంతమైన ఆహారం అనగా పౌష్టికాహారం(Nutrition food) ఇచ్చేలా చూడాలని, దానివల్ల వారికి శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యులు అంటున్నారు.కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనలో, పరిశోధకులు 32,321 మంది పిల్లలను కౌమారదశలో ఉన్న వారిలో మానసిక ఆరోగ్య పరిస్థితి పై అధ్యయనం చేశారు.
పౌష్టికాహారం తీసుకోని పిల్లల్లో ఇతరుల పిల్లల కంటే మానసిక ఆరోగ్య రుగ్మతలు 55% ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. పౌష్టికాహారం తినని పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Image credit: wirally

కెనడా లోని వెస్ట్రన్ యూనివర్సిటీ కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కెల్లీ అండర్సన్ ఏమన్నారంటే పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడమే కాకుండా, అటువంటి పిల్లలు మత్తు పదార్థాలు వాడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు .ఈ రెండు కూడా జీవన విధానానికి అత్యంత ప్రమాదకరం అన్నారు .ఇవి శారీరక, మానసిక, సామాజిక, విద్యా అభివృద్ధిపై కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. పిల్లల్లో పోషకాహార లోపం ఉన్నప్పటికీ, కోవిడ్ 19 తర్వాత దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Vastu Tips : ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. మీ ఇంట్లో డబ్బు, ఆనందానికి లోటే ఉండదు..

ఆహార కొరత వల్ల మానసిక, ఆరోగ్య సమస్యలు మధ్య ఉన్న సంబంధం మరింత కఠినంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా దేశాల పిల్లలు ఇంకా పోషకాహార లోపంతో ఉన్నారు. ఇది వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మొత్తానికి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది.
కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలు ఆహారం పై స్పెషల్(Special care) కేర్ తీసుకొని వారికి పౌష్టికాహారం అందించే బాధ్యత వారిపైన ఉంది అని ఆరోగ్య నిపుణులు వ్యక్తపరిచారు. పిల్లలకు పచ్చి కూరగాయలు, పాలు ,తృణధాన్యాలు ఇలా మొదలైన పౌష్టికాహారాన్ని రోజువారి ఆహారంలో భాగంగా చేర్చాలి.

జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ లకు పిల్లలను దూరంగా ఉంచాలి. వీరికి కూడా మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.